తిమ్మాజిపేట, అక్టోబర్ 13 : తిమ్మాజిపేట మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి నుంచి కొందరు నాయకులు బీఆర్ఎస్లో చేరగా, తాజాగా భారీగా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి గులాబీ గూటికి చేరడంతో కారు జోరందుకున్నది. మండలంలో పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ ముఖ్యనాయకులు పార్టీని వీడి బీఆర్ఎస్కు జై కోట్టారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డితో సహా చాలా మంది నాయకులు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
అధికార పార్టీ ప్రజావ్యతిరేఖ విధానాలు, పార్టీలో నాయకుల తీరు నచ్చక హైదరాబాద్‌లో మర్రి జనార్దన్‌రెడ్డిని కలిసి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దశాబ్దాలుగా పార్టీలో ఉన్నామని, అయితే అధికారంలో వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని నాయకులు తెలిపారు. గతంలో తెలంగాణలో కేసీఆర్ పాలన, నియోజకవర్గంలో మర్రి జనార్దన్‌రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరినట్లు ప్రకటించారు. మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ నాయకులు రామస్వామి, బాచయ్య, పెంటయ్య, భీమయ్య, నాగరాజు, భీమయ్య, చంద్రయ్య, రమేశ్, వెంకటేశ్, పవన్, వంశీ, శ్రీను, విజయ్, చెన్నయ్య తదితరులు ఉన్నారు. పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెంకటస్వామితోపాటు మం డల నాయకులు ఉన్నారు.