సిటీబ్యూరో, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. సనత్ నగర్ పీఎస్ పరిధిలో ఎర్రగడ్డ వద్ద గల కల్పతరు జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేశారు. అనంతరం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట బాలానగర్ డీసీపీ, ఏసీపీలు ఉన్నారు.