న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 : హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్(హెచ్యూఎల్) అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.6,604 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
కిందటేడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.2,989 కోట్లతో పోలిస్తే రెండింతలు పెరిగింది. ఐస్క్రీం వ్యాపారాన్ని విడగొట్టి ప్రత్యేక సంస్థగా తీర్చిదిద్దడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని పేర్కొంది. కంపెనీ విక్రయాలు 5.71 శాతం ఎగబాకి రూ.16,197 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి వెల్లడించింది.