ముంబై, ఫిబ్రవరి 12 : లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే గురువారం బ్యాంకర్ల లోన్ రికవరీ వ్యవస్థల కోసం ముసాయిదా నిబంధనలతో వచ్చింది. రుణ బకాయిల వసూలుకు వెళ్లే ఏజెంట్లకు శిక్షణ తప్పనిసరి అన్నది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (ఐఐబీఎఫ్) నిర్వహించే ‘రుణ రికవరీ శిక్షణ’లో రికవరీ ఏజెంట్లు పాల్గొనాలన్న నిబంధననూ ఆర్బీఐ పరిశీలిస్తున్నది.
అప్పుల వసూలుకు ప్రత్యేకంగా బ్యాంకులు నియమించుకుంటున్న ఏజెంట్లు.. రుణగ్రహీతలను దూషిస్తూ, అసభ్యకర రీతిలో ప్రవర్తిస్తుండటంతో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. బిహార్‌లో ఓ లోన్ రికవరీ ఏజెంట్ కారణంగా రుణగ్రహీత దగ్గరి బంధువు చనిపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆర్బీఐ.. తాజాగా పలు మార్గదర్శకాలను ప్రతిపాదించింది. తమ పర్యవేక్షణలోని అన్ని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు పాటించేలా సూచనలు చేసింది. నిజానికి ఇటీవలి ద్రవ్యసమీక్షలోనే ఆర్బీఐ ఈ సంకేతాలను ఇచ్చింది. దానికి తగ్గట్టే గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. వీటి ప్రకారం..
కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) పథకం పునరుద్ధరణకు ఆర్బీఐ ముసాయిదా సూచనలను జారీ చేసింది. మార్చి 6లోగా దీనిపై సంస్థలు, భాగస్వాములు, ప్రజల అభిప్రాయాలను కోరింది. రుణ మంజూరు, చెల్లింపుల షెడ్యూళ్ల కోసం స్వల్పకాలిక పంటల సమయాన్ని 12 నెలలుగా, దీర్ఘకాలిక పంటల సమయాన్ని 18 నెలలుగా నిర్వచించింది.