Inter student Suicide | గురుకులంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Inter student Suicide | మహబూబ్‌నగర్ మండలం రామ్ రెడ్డి గూడెం సోషల్ వెల్ఫేర్ గురుకులంలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్ మండలం రామ్ రెడ్డి గూడెం సోషల్ వెల్ఫేర్ గురుకులంలో ఇంటర్ మొదటి సంవత్సరం(Inter student ) ఎంపీసీ విద్యార్థిని ఆత్మహత్య(Suicide) చేసుకుంది. గద్వాల జిల్లా మల్దకల్ పట్టణ కేంద్రానికి చెందిన నగేష్, పద్మమ్మ దంపతుల ఐదు మంది ఆడపిల్లల్లో మూడో కూతురు ప్రియాంక (15) పదవ తరగతి వరకు అదే మండలం గురుకులంలో చదువుకుంది. ఇంటర్లో కూడా అక్కడే సీటు వస్తే అక్కడ నుంచి ఆమెను మహబూబ్‌నగర్ గురుకులానికి బదిలీ చేశారు. అప్పటినుంచి ఆమె ఇక్కడే చదువుతుంది.
మూడు రోజుల క్రితం హాస్టల్ వాతావరణం సక్రమంగా లేదని, ఇక్కడ చదువుకోను ఇంటికి వస్తానని తల్లిదండ్రులకు వివరించింది. అయితే తాము సోమవారం వస్తామని కూతురికి నచ్చజెప్పారు. అయితే సోమవారం ఉదయం హాస్టల్ బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడి చనిపోయింది. బాత్రూం తలుపు తీయకపోవడంతో విద్యార్థులు గమనించి హాస్టల్ వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు.
వార్డెన్ వచ్చి గమనించి ఆమెను వెంటనే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు విద్యార్థిని మృతిచెందని నిర్ధారించారు. హాస్టల్లో 800 మందికి పైగా విద్యార్థులు ఉండడంతో అసౌకర్యంగా ఉన్నందుకే తన కూతురు హాస్టల్ నచ్చక చనిపోయిందని తండ్రి ఆరోపించారు.
విషయం తెలుసుకున్న కలెక్టర్ జయేంద్ర పోయి ఆసుపత్రిని సందర్శిం వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై పూర్తి విచారణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తమ కూతురు మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. మృతురాలి వద్ద ఉన్న సూసైడ్ నోట్ కూడా ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

