రవీంద్రభారతి, అక్టోబర్13: గొప్ప తాత్విక కవి, గరికపూల చెలిమి యాకూబ్ అని ప్రముఖ కవి, వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలుగు భాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న హాజరై మాట్లాడుతూ యాకూబ్ మనుషుల జీవితం గురించి తన 40 ఏండ్ల కవితా ప్రయాణంలో అనేక కవితలు తన కలం వెంట జాలు వారాయని కొనియాడారు.
మరో విశిష్ట అతిథి ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ కవి, విమర్శకుడు వేరు వేరు కాదని, విమర్శకుడైన కవే అసలైన కవిత్వాన్ని సృజిస్తాడన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి, సదస్సు కన్వీనర్ డాక్టర్ చంద్రయ్య, రాచమల్ల చంద్రారెడ్డి, తెలుగు భాషా చైతన్య సమితి అధ్యక్షుడు బడేసాబ్, కవి నాళేశ్వరం శంకరం పాల్గొన్నారు.