హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల భూ స్కామ్ కోసమే హైదరాబాద్ ఇండస్ట్రియల్ లాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టీపీ)ని తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ పాలసీ ద్వారా 9,292 ఎకరాల ప్రభుత్వ భూమిని తమ అనుయాయులకు చౌకగా కట్టబెట్టేందుకు తెరతీసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ఇలాంటి అవినీతి అక్రమాలపై విద్యార్థి నాయకులు పోరాడి తెలంగాణ వనరులను కాపాడాలని పిలుపునిచ్చారు. నందినగర్‌లోని తన నివాసంలో బీఆర్ఎస్వీ నాయకులతో స మావేశమైన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
గతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రజల నుంచి సేకరించిన ప్రభుత్వ భూమిని తకువ ధరకు పారిశ్రామిక వ్యక్తులకు గత ప్రభుత్వాలు ఇచ్చాయని గుర్తుచేశారు. అప్పటి మారెట్ రేటుకు సంబంధం లేకుండా అత్యంత చవకగా ఈ భూములను అం దించాయని చెప్పారు. కానీ, ప్రస్తుత కాం గ్రెస్ సర్కారు హైదరాబాద్‌లో ఉన్న 20 పారిశ్రామికవాడల్లోని 9,292 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు కుట్ర పన్నిందని విమర్శించారు.
ఒకప్పుడు పరిశ్రమల కోసం, ప్రజ ల ఉపాధి కోసం ఇచ్చిన భూముల్లో ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులు అపార్ట్మెంట్లు కడతామంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాం గ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల లాభం కోసం కోట్ల విలువైన భూములను రియల్ ఎస్టేట్ కోసం ధారాదత్తం చేస్తున్నదని మండిపడ్డారు. రూ.5 లక్షల కోట్ల భూము ల సామ్‌కు తెరలేపిందని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డితోపాటు ఆయన మనమడు, ముని మనమడి వరకు కావాల్సినన్ని డబ్బులు సంపాదించుకునే ప్రయత్నంలో భాగంగానే హిల్ట్ పాలసీ తీసుకొచ్చారని కేటీఆర్ నిప్పులుచెరిగారు. ఈ పాలసీతో అంబానీ సరసన నిలవాలని రేవంత్‌రెడ్డి ప్రయత్నిన్నట్టుగా కనిపిస్తున్నదని ఎద్దేవాచేశారు. వీటిపై ప్రజలను జాగృతం చేయాలని పిలుపునిచ్చారు.