హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): పారిశ్రామిక భూములను మల్టిపుల్ జోన్లుగా మార్చితే పర్యావరణ, ఆర్థిక, సామాజిక విధ్వంసం తప్పదని ప్రముఖ పర్యావరణవేత్త, కన్సల్టెంట్ ఇన్ వాటర్ రిసోర్సెస్ అండ్ ైక్లెమేట్ చేంజ్ బీవీ సుబ్బారావు హెచ్చరించారు. ‘హిల్ట్ పాలసీ-భవిష్యత్తు పరిణామాలు’అనే అంశంపై ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను పంచుకున్నారు.
బీవీ సుబ్బారావు: హిల్ట్ పాలసీ పర్యావరణ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలపై తీవ్ర ప్రభా వం చూపుతుంది. ఈ మూడు రంగాలు భవిష్యత్తులో దెబ్బతింటాయి. పారిశ్రామికవాడల్లో ఉన్న భూములలో ఇప్పటికే భూగర్భజలాలు ప్రమాదకర స్థాయిలో కలుషితం అయ్యాయి. కొత్తగా ఇండ్లు కడితే ఫౌండేషన్ నిలబడే పరిస్థితి లేదు. హై డిజాస్టర్ రిస్క్ ఉంటుంది.
బీవీ సుబ్బారావు: ఈ పాలసీపై ప్రభుత్వం కనీసం పర్యావరణవేత్తలతో కూడా చర్చించలేదు. ప్రజలతో అయినా మాట్లాడి ఉండాల్సింది. జీడిమెట్ల ప్రాంతంలో ఇప్పటికే నీళ్లు కలుషితం అవుతున్నాయని స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. బాచుపల్లిలో వాయు కాలుష్యంపై ధర్నాలు చేసే పరిస్థితి. నల్లగండ్ల వరకు వాయు కాలుష్యం సమస్య వేధిస్తున్నది. పారిశ్రామిక వాడల్లో మార్పులు తేవాలని జర్మనీ ప్రభుత్వం రాష్ర్టానికి నిధులు ఇచ్చింది. ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారు? ఎంత కాలుష్యాన్ని తగ్గించారనే అంశంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి. సమగ్ర నివేదికను ప్రజా డొమైన్లో ఉంచాలి.
బీవీ సుబ్బారావు: ఏ ప్రాతిపదికన ఈ పా లసీ తీసుకువస్తున్నారో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో ప్రజాస్వా మ్యం నడుస్తున్నదా? లేక మోనార్కిజం నడుస్తున్నదా? ప్రభుత్వ సలహాదారులు ఎవరు వచ్చినా చర్చకు మేము సిద్ధం. ఏమైనా ప్రశ్నిస్తే గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ కదా? ఈ పాలసీని అమలు చేస్తున్నది వాళ్లే కదా. ఇప్పటికే ఉన్న హైడెన్సిటీ నిర్మాణాలతో వాతావరణంలో భారీమార్పులు సంభవించాయి.
బీవీ సుబ్బారావు : భారీ అంతస్థుల నిర్మాణాలను ఈ భూముల్లో నిర్మిస్తే విడుదలయ్యే సాలిడ్ వేస్ట్, మురుగునీరు వెళ్లడానికి వ్యవస్థ ఉందా? పర్యావరణం, ప్రజారోగ్యం గురించి ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు.
బీవీ సుబ్బారావు: తెలంగాణ అభివృద్ధి మాడల్ అని ప్రభుత్వం చెప్తున్నా.. సామాన్యులను హైదరాబాద్ నుంచి వెళ్లగొట్టేలా ప్రభుత్వ చర్య ఉన్నది. సగటు వ్యక్తి హైదరాబాద్లో ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా? పర్యవసానాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఈ పాలసీని తీసుకువస్తున్నది.
బీవీ సుబ్బారావు: హిల్ట్ పాలసీతో పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరుతుందన్నది నిజం. ఇండస్ట్రీ పేరిట బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటున్న పారిశ్రామికవేత్తలు భూమి విషయంలో ప్రభుత్వం కల్పిస్తున్న వెసులుబాటుతో ఖరీదైన ఏరియాల్లో ఇండ్లు కడుతున్నారు. బ్యాంకులకు పెద్ద మొత్తంలో డబ్బును ఎగ్గొడుతున్నారు.