దోచుకోడానికే హిల్ట్ పాలసీ
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల భూ స్కామ్ కోసమే హైదరాబాద్ ఇండస్ట్రియల్ లాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టీపీ)ని తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
- 5 లక్షల కోట్ల అవినీతికి పథక రచన
- 9,292 ఎకరాలను అనుయాయులకు
- కారుచౌకగా అప్పగించేందుకు కుట్ర
- కోట్ల విలువైన భూమి కట్టబెట్టే యత్నం
- మునిమనుమడి వరకు కావాల్సినంత
- దోచుకొనేందుకు రేవంత్ కుతంత్రం
- సర్కారు దోపిడీపై విద్యార్థులు పోరాడాలి
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల భూ స్కామ్ కోసమే హైదరాబాద్ ఇండస్ట్రియల్ లాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టీపీ)ని తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ పాలసీ ద్వారా 9,292 ఎకరాల ప్రభుత్వ భూమిని తమ అనుయాయులకు చౌకగా కట్టబెట్టేందుకు తెరతీసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ఇలాంటి అవినీతి అక్రమాలపై విద్యార్థి నాయకులు పోరాడి తెలంగాణ వనరులను కాపాడాలని పిలుపునిచ్చారు. నందినగర్‌లోని తన నివాసంలో బీఆర్ఎస్వీ నాయకులతో స మావేశమైన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
గతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రజల నుంచి సేకరించిన ప్రభుత్వ భూమిని తకువ ధరకు పారిశ్రామిక వ్యక్తులకు గత ప్రభుత్వాలు ఇచ్చాయని గుర్తుచేశారు. అప్పటి మారెట్ రేటుకు సంబంధం లేకుండా అత్యంత చవకగా ఈ భూములను అం దించాయని చెప్పారు. కానీ, ప్రస్తుత కాం గ్రెస్ సర్కారు హైదరాబాద్‌లో ఉన్న 20 పారిశ్రామికవాడల్లోని 9,292 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు కుట్ర పన్నిందని విమర్శించారు.
ఒకప్పుడు పరిశ్రమల కోసం, ప్రజ ల ఉపాధి కోసం ఇచ్చిన భూముల్లో ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులు అపార్ట్మెంట్లు కడతామంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాం గ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల లాభం కోసం కోట్ల విలువైన భూములను రియల్ ఎస్టేట్ కోసం ధారాదత్తం చేస్తున్నదని మండిపడ్డారు. రూ.5 లక్షల కోట్ల భూము ల సామ్‌కు తెరలేపిందని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డితోపాటు ఆయన మనమడు, ముని మనమడి వరకు కావాల్సినన్ని డబ్బులు సంపాదించుకునే ప్రయత్నంలో భాగంగానే హిల్ట్ పాలసీ తీసుకొచ్చారని కేటీఆర్ నిప్పులుచెరిగారు. ఈ పాలసీతో అంబానీ సరసన నిలవాలని రేవంత్‌రెడ్డి ప్రయత్నిన్నట్టుగా కనిపిస్తున్నదని ఎద్దేవాచేశారు. వీటిపై ప్రజలను జాగృతం చేయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

