భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం నెలకొన్నది. వర్షాకాల సమావేశాల ఐదవ రోజు కూడా ప్రతిపక్షాల నినాదాలతో సభ దద్దరిల్లింది. (Chaos In Madhya Pradesh Assembly) ఆర్మీ ఆఫీసర్ కల్నల్ సోఫియా ఖురేషి గురించి గిరిజన సంక్షేమ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో మంత్రి విజయ్ షాపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర స్థాయిలో దాడి చేశారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాఖాపరమైన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి మంత్రి లేచిన వెంటనే ‘విజయ్ షా రాజీనామా’ చేయాలన్న నినాదాలతో సభ ప్రతిధ్వనించింది. ఈ గందరగోళం కారణంగా స్పీకర్ నరేంద్ర సింగ్ తోమర్ సభను రెండుసార్లు వాయిదా వేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో చివరకు ఆగస్ట్ 4 వరకు అసెంబ్లీని వాయిదా వేశారు.
కాగా, మంత్రి విజయ్ షాపై ప్రతిపక్ష నాయకుడు ఉమాంగ్ సింఘర్ తీవ్రంగా మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ మంత్రిని ప్రభుత్వం కాపాడుతున్నదని ఆరోపించారు. అయితే మంత్రి కైలాష్ విజయ్ వర్గియా కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ‘పాకిస్థాన్ భాష’ మాట్లాడుతున్నదని, సభను అగౌరవపరుస్తున్నదని ఆరోపించారు. మరో మంత్రి విశ్వాస్ సారంగ్ కూడా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
Also Read:
Watch: మహిళ ఇంటికి వెళ్లిన పోలీస్ అధికారి.. ఆమె ఏం చేసిందంటే?
Woman Married 8 Men | 8 మందిని పెళ్లాడి దోచుకున్న మహిళ.. 9వ పెళ్లికి సిద్ధమవుతుండగా అరెస్ట్
Peon gives urine to senior | తాగునీరు అడిగిన సీనియర్ అధికారి.. మూత్రం నింపిన బాటిల్ ఇచ్చిన ప్యూన్