CCTV footage : బిగ్‌బాస్ (Big boss) ఓటీటీ సీజన్-2 విజేత, ప్రముఖ సోషల్ మీడియా (Social Media) ఇన్ఫ్లూయెన్సర్ ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) ఇంటిపై ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
సీసీ ఫుటేజీని పరిశీలిస్తే.. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు ముగ్గురు వ్యక్తులు బైకుపై గురుగ్రామ్‌లోని ఎల్విష్ యాదవ్ ఇంటి వద్దకు చేరుకున్నారు. కాసేపటి తర్వాత వారిలో ఇద్దరు ఎల్విష్ ఇంటిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత వాళ్లు కాసేపు కాల్పులు ఆపి బుల్లెట్లను లోడ్ చేసుకున్నారు. ఆ తర్వాత మరో రౌండ్ కాల్పులు జరిపారు. వారిలో ఒకడైతే ఇంటి మెయిన్ గేట్ దగ్గరికి వెళ్లి కాల్పులు జరిపాడు. అలా మొత్తం 25 రౌండ్ల కాల్పులు జరిపి ముగ్గురు పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫోరెన్సిక్ బృందాల సహాయంతో తనిఖీలు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. భవనంలోని రెండు, మూడో అంతస్తుల్లో ఎల్విష్ యాదవ్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దుండగుల కాల్పుల్లో తూటాలు మొదటి అంతస్తులోకి దూసుకువెళ్లాయి.
దాడి జరిగిన సమయంలో ఎల్విష్ ఇంట్లో లేడని, అతడి కుటుంబసభ్యులు, కేర్‌టేకర్ ఉన్నారని పోలీసులు చెప్పారు. కాగా ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులు జరిపింది తామేనని హిమాన్షు బావు గ్యాంగ్ ప్రకటించింది. ఎల్విష్ యాదవ్ బెట్టింగ్‌ను ప్రమోట్ చేస్తున్నాడని, అందుకే కాల్పులు జరిపామని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది. ఇప్పుడు మేమేందో ఎల్విష్ యాదవ్‌కు పరిచయం చేశామని ఆ పోస్టులో పేర్కొన్నారు.
బెట్టింగ్‌ను ప్రమోట్ చేయడం ద్వారా ఎల్విష్ ఎన్నో కుటుంబాలను నాశనం చేశాడని ఎల్విష్ గ్యాంగ్ ఆరోపించింది. ఇకపై కూడా ఎవరైతే బెట్టింగ్‌ను ప్రమోట్ చేస్తారో వారికి ఏ క్షణంలోనైనా ఫోన్ కాల్ రావచ్చునని, లేదంటే ఆ ఇంటిపైకి బుల్లెట్లు దూసుకురావచ్చని హిమాన్షు గ్యాంగ్ హెచ్చరించింది. బెట్టింగ్ రాయుళ్లు తమను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సవాల్ చేసింది.
CCTV footage of firing incident at @ElvishYadav house 🚨
A dozen bullets fired by 2 Men Continuous at YouTuber Elvish Yadav’s Gurgaon Residence 💔
Haryana Government & Police Take Strict Action on this @cmohry @police_haryana @gurgaonpolice #ElvishYadav #ElvishYadav𓃵 pic.twitter.com/lSsfuOa8HJ
— Elvish Hunters (@Rahul143043) August 17, 2025