న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో (Delhi ) దారుణం చోటుచేసుకున్నది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో కన్న తల్లిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో యువకుడు. గతంలో ఆమె చేసిన తప్పుకు ఇది శిక్ష అని పేర్కొంటూ ఆమెపై రెండుసార్లు లైంగికదాడి చేశాడు. సెంట్రల్ ఢిల్లీలోని హౌజ్ ఖాజీ ప్రాంతంలో బాధితురాలి కుటుంబం నివాసం ఉంటున్నది. ఆమె భర్త రిటైర్డ్ ఉద్యోగి. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, 39 ఏండ్ల కొడుకు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, ఆమె అదే పరిసరాల్లో తన భర్త, అత్తమామలతో ఫాటు ఉంటోంది. అయితే జూలై 17న బాధితురాలు, ఆమె భర్త , చిన్న కుమార్తె సౌదీ అరేబియాకు వెళ్లారు. ఈ సమయంలో నిందితుడు తన తండ్రికి ఫోన్ చేసి, వారిని వెంటనే ఢిల్లీకి తిరిగి రమ్మని కోరాడు. తల్లికి విడాకులు ఇవ్వాలని, ఆమెకు కొన్నేళ్లుగా ఇతరులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని చెప్పాడు. తరువాత కూడా కుమారుడు ఇదే తరహాలో తండ్రికి ఫోన్లు చేస్తూ వచ్చాడు. ఈ నెల ఒకటిన యాత్ర ముగించుకుని వారు ఢిల్లీకి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో తల్లిని ఒక గదిలోకి తీసుకెళ్లిన కుమారుడు.. ఆమెపై దాడి చేశాడు. ఆ తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డాడు.
కుమారుని ప్రవర్తనకు భయపడిన ఆ తల్లి పెద్ద కుమార్తె ఇంటికి వెళ్లింది. ఆగస్టు 11న తిరిగి తమ ఇంటికి వచ్చింది. ఆరోజు రాత్రి 9.30 గంటల సమయంలో, నిందితుడు తన తల్లితో ఏకాంతంగా మాట్లాడాలని చెప్పి ఓ గదిలోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెను బంధించాడు. గతంలో ఆమె చేసిన తప్పుకు శిక్షిస్తున్నానని కుటుంబ సభ్యులతో చెప్పాడు. ఈ నెల 14న తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఆమె ఉంటున్న గదిలోకి వెళ్లిన నిందితుడు.. ఆమెపై మరోసారి లైంగికదాడికి పాల్పడ్డాడు.
మరుసటి రోజు తనపై జరిగిన అఘాయిత్యం గురించి బాధితురాలు తన చిన్న కూతురికి వివరించింది. దీంతో ఇద్దరూ కలిసి హౌజ్ ఖ్వాజీ పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేశారు. దీంతో బీఎన్ఎస్ సెక్షన్ 64 (లైంగికదాడి) కింద కేసు నమోదుచేసి, నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
కలిసి ఉంటున్నది.