Heavy rains : తెలంగాణ రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు తెలంగాణ సెంట్రల్, ఈస్ట్ జిల్లాలకు భారీ వర్షసూచన చేశారు. భద్రాద్రి, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జనగామ, వికారాబాద్, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని అంచనావేశారు. ఇక హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురుస్తాయని తెలిపారు. నగరంలో 24 గంటల్లో 30 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొన్నారు.