Elvish Yadav | బిగ్‌బాస్ విజేత ఎల్విష్ యాదవ్ ఇంటిపై 12 రౌండ్ల కాల్పులు..!
Elvish Yadav | హిందీలో ప్రసారమైన బిగ్‌బాస్ (Big boss) ఓటీటీ సీజన్-2 విజేత, ప్రముఖ సోషల్ మీడియా (Social Media) ఇన్ఫ్లూయెన్సర్ ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) ఇంటిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు.
Elvish Yadav : హిందీలో ప్రసారమైన బిగ్‌బాస్ (Big boss) ఓటీటీ సీజన్-2 విజేత, ప్రముఖ సోషల్ మీడియా (Social Media) ఇన్ఫ్లూయెన్సర్ ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) ఇంటిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో గురుగ్రామ్‌లోని అతడి ఇంటి వద్దకు ముగ్గురు గుర్తుతెలియని దుంగడులు బైక్‌పై వచ్చారు. కాసేపు అక్కడే తచ్చాడి ఎల్విష్ నివాసంపై 12 రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫోరెన్సిక్ బృందాల సహాయంతో తనిఖీలు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. భవనంలోని రెండు, మూడో అంతస్తుల్లో ఎల్విష్ యాదవ్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దుండగుల కాల్పుల్లో తూటాలు మొదటి అంతస్తులోకి దూసుకువెళ్లాయి.
దాడి జరిగిన సమయంలో ఎల్విష్ ఇంట్లో లేడని, అతడి కుటుంబసభ్యులు, కేర్‌టేకర్ ఉన్నారని పోలీసులు చెప్పారు. పోలీసులు నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అయితే కాల్పులకు ముందు అతడికి ఎలాంటి బెదిరింపులు రాలేదని కుటుంబసభ్యులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

