Lady cop | ఆటోలో మహిళకు తీవ్ర పురిటినొప్పులు.. సమయస్ఫూర్తితో స్పందించిన లేడీ కానిస్టేబుల్
Lady cop | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని తిరుప్పూర్ (Thiruppur) జిల్లా వేళంపాళ్యంలో ఆటోలో ఆసుపత్రికి వెళుతున్న నిండు గర్భిణికి మార్గమధ్యలోనే పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. ఆసుపత్రికి వెళ్లేంత సమయం కూడా లేకపోవడంతో ఆ మార్గంలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ (Lady conistable) స్పందించారు.
Lady cop : తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని తిరుప్పూర్ (Thiruppur) జిల్లా వేళంపాళ్యంలో ఆటోలో ఆసుపత్రికి వెళుతున్న నిండు గర్భిణికి మార్గమధ్యలోనే పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. ఆసుపత్రికి వెళ్లేంత సమయం కూడా లేకపోవడంతో ఆ మార్గంలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ (Lady conistable) స్పందించారు. ఆటోలోనే మహిళకు పురుడుపోసి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు.
వేళంపాళ్యం పోలీసుస్టేషన్ పరిధిలోని తిరుమురుగన్‌పూండి రింగ్ రోడ్డులో గత గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో రింగ్ రోడ్డు వద్ద పోలీసులు ఆరోజు వాహన తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఆటోలో ఒడిశా రాష్ట్రానికి చెందిన భారతి అనే మహిళ పురుటినొప్పులతో బాధపడుతుండటం పోలీసులు గమనించారు.
అప్పటికే బిడ్డ సగం బయటికి రావడంతో ఆసుపత్రికి తరలించే సమయం కూడా లేకపోయింది. దాంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ కోకిల ముందుకువచ్చి భారతికి పురుడు పోశారు. నర్సింగ్ కోర్సు చదివిన కోకిల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరకముందు ఆసుపత్రిలో పనిచేశారు. ఆ అనుభవంతోనే భారతికి పురుడు పోసినట్లు కోకిల తెలిపారు. ప్రసవానంతరం తల్లీబిడ్డలను తిరుప్పూర్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో చేర్చామని, ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పోలీసులు చెప్పారు.
కాగా సమయస్ఫూర్తితో వేగంగా స్పందించి గర్భిణికి పురుడు పోసిన కానిస్టేబుల్ కోకిలను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.
Read More >>
ఆగస్టు 22న ట్రంప్, పుతిన్, జెలెన్స్కీల త్రైపాక్షిక సమావేశం..!
రాహుల్‌గాంధీ ‘ఓట్ అధికార్ యాత్ర’ ప్రారంభం..
చేసిన పనికి శిక్ష ఇదేనంటూ.. 65 ఏండ్ల తల్లిపై కుమారుడి లైంగికదాడి..
రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు
బిగ్‌బాస్ విజేత ఎల్విష్ యాదవ్ ఇంటిపై 12 రౌండ్ల కాల్పులు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

