MK Stalin | అహంకారం వినాశనానికి దారి తీస్తుంది.. విజయ్, బీజేపీకి మాజీ సీఎం స్టాలిన్ చురకలు
MK Stalin : త్రిషపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ను టీవీకే ఆధ్వర్యంలోని విజయ్ ప్రభుత్వం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఉదయనిధిని అరెస్టు చేయడంపై ఆయనర తండ్రి, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అహంకారం వినాశనానికి దారితీస్తుందని తమిళనాడు సీఎం విజయ్ను హెచ్చరించారు.
MK Stalin : త్రిషపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ను టీవీకే ఆధ్వర్యంలోని విజయ్ ప్రభుత్వం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఉదయనిధిని అరెస్టు చేయడంపై ఆయనర తండ్రి, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అహంకారం వినాశనానికి దారితీస్తుందని తమిళనాడు సీఎం విజయ్ను హెచ్చరించారు. త్రిషపై వ్యాఖ్యల కేసులో అరెస్టైన ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు స్టేషన్ బెయిల్పై విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. ఉదయనిధి విడుదల అనంతరం ఎంకే స్టాలిన్ తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా స్పందించారు.
ఉదయనిధిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అహంకారం వినాశనానికి దారి తీస్తుందని, అది కూడా మొండితనంతో కూడిన అహంకారం మరింత వేగంగా వినాశనానికి కారణమవుతుందని స్టాలిన్ అన్నారు. కావేరి నది జలవివాదంపై ప్రజల దృష్టి మళ్లించేందుకే ఉదయనిధిని ప్రభుత్వం అరెస్టు చేసిందని స్టాలిన్ ఆరోపించారు. కావేరి విషయంలో హైకోర్టు ఆదేశాలు తమిళనాడుకు ఎదురుదెబ్బ అని, ఇది కేంద్రంలోని బీజేపీ నిరంకుశ పాలనకు నిదర్శనం అని స్టాలిన్ అభివర్ణించారు. కావేరి నది, ఈ నదిపై కర్ణాటక నిర్మిస్తున్న మేకేడాటు డ్యామ్ ప్రాజెక్టును అడ్డుకోవడంలో బీజేపీ విఫలమైందని, ఇది తమిళనాడుపై బీజేపీకి ఉన్న నిరంకుశ విధానాన్ని తెలియజేస్తుందని స్టాలిన్ విమర్శించారు. ఇదే సమయంలో కావేరి అంశంలో ఉదయనిధి వ్యాఖ్యలను స్టాలిన్ సమర్ధించారు. రైతుల ఆందోళనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని స్టాలిన్ అన్నారు. ఉదయనిధిని పోలీసులు అరెస్టు చేసిన తీరుపై కూడా స్టాలిన్ విమర్శలు గుప్పించారు.
ప్రశ్నించడానికే పోలీసులు ఉదయనిధిని అరెస్టు చేస్తే తంజావూరు ఎందుకు తీసుకెళ్లారని స్టాలిన్ ప్రశ్నించారు. తన తనయుడిని కస్టడీకి తీసుకోవడంలో అనేక చట్టపరమైన ఉల్లంఘనలు ఎందుకు జరిగాయని ప్రశ్నించారు. త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఉదయనిధిని సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆయన తరఫున లాయర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు విచారణ జరిపింది. ఈ విషయంపై ప్రభుత్వం స్పందిస్తూ.. ఉదయనిధిని కస్టడీలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేమని, ప్రశ్నించి వదిలేస్తామని కోర్టుకు తెలిపింది. దీంతో ప్రశ్నించిన అనంతరం ఉదయనిధిని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు ఆయనను సోమవారం సాయంత్రం విడిచిపెట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

