Bus Accident: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Bus Accident) జరిగింది. గురువారం తెల్లవారుజామున 44వ జాతీయ రహదారిపై మాచారం వద్ద ముందు వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్‌ను జగన్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ నుంచి పొగలు బయటకు వచ్చాయి. భయాందోళనలకు గురైన ప్రయాణికులు హుటాహుటిన బస్సులో నుంచి బయటకు వచ్చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పొగలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ట్రావెల్స్ బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రయాణికులను మరో బస్సులో వారి గమ్యస్థానాలకు పంపించారు.