ప్రజాపాలన ప్రభుత్వంలో ఇసుక వ్యాపారం కాసులు కురిపిస్తున్నది. దీంతో అక్రమంగా తరలించేందుకు వ్యాపారులు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. కొందరు అభివృద్ధి పనుల పేరుతో.. మరికొందరు ఇందిరమ్మ ఇండ్లకంటూ.. యథేచ్ఛగా తరలిస్తున్నారు. వాహనాలకు రక్షణగా బైకులపై పైలెట్లు వెళ్తూ.. ఎవరూ అడ్డుపడకుండా గమ్యం చేర్చుతారు. ఎవరైనా అడ్డొస్తే అధికార పార్టీ నాయకులకు సమాచారం చేరవేస్తారు.. వారు ఎంట్రీ ఇచ్చి అధికార పలుకుబడితో కథ ముగిస్తారు. ఇలా వ్యాపారం సాగుతుండడంతో నిత్యం ‘మూడు పువ్వులు.. ఆరు కాయలు’గా విరాజిల్లుతున్నది. దీనికితోడు మైనర్లు వాహనాలను నడుపుతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
– కల్వకుర్తి, నవంబర్ 19
ఇసుక వ్యాపారం జోరందుకున్నది. పగ లు, రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా తరలిస్తున్నారు. కల్వకుర్తి నియోజక వర్గంలో వంద పడకల దవాఖాన నిర్మాణ ముసుగులో దందా ఊ పందుకున్నా అధికారులు ప ట్టించుకోవడం లేదన్న విమ ర్శలు వినిపిస్తున్నాయి. ఇం దిరమ్మ ఇండ్ల నిర్మాణం తోడవ్వడంతో అక్ర మార్కులు ఈ వ్యా పారానికి తెరలే పా రు. ఒకటి కా దు.. రెండు కా దు దాదాపు 100 ట్రా క్టర్లు అను మతుల ముసుగేసుకుని 24/7 దుందుభీ వాగు నుంచి ఇసుకకు తోడుకుంటూ హల్ చల్ చేస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు చిల్లర దేవుళ్లు ఈ దందాలో సూత్రదారులుగా ఉన్నారన్న ఆరోపణలు ఉ న్నాయి. ఇసుక అక్రమ రవాణాను అరిక ట్టాల్సిన అధికారులు అసలు పట్టించు కోవడం లేదనే విమర్శలు మూటగట్టుకుం టున్నారు. ఈ అక్రమ దందాతో సామాన్యు డికి ఏదైనా మేలు జరుగుతుందా? అంటే అదీ లేదు. ట్రాక్టర్ ఇసుకను రూ.6,500 నుంచి రూ.7,500 వరకు కొనుగోలు చే యాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు.
అభివృద్ధి పనుల పేరుతో..
కల్వకుర్తి పట్టణంలో నిర్మిస్తున్న 100 పడ కల దవాఖాన నిర్మాణంతోపాటు ఇంది రమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక అవసరం
అవుతున్న నేప థ్యంలో రెవెన్యూ
అధికారులు రవాణాకు అనుమతులు ఇస్తు న్నారు. ఈ అనుమతుల ముసుగులో అక్ర మ రవాణా జోరుగా సాగుతున్నది. దాదాపు 100 వరకు ట్రాక్టర్లు నిత్యం ఇసుకను తరలిస్తున్నాయి.
లింగసానిపల్లి నుంచి..
కల్వకుర్తి మండలం లింగసానిపల్లి సమీ పం లోని దుందుభీ వాగు నుంచి ఇసుక తీ య డానికి అధికారులు అనుమతులు ఇచ్చారు. కూపన్లు పొందిన ట్రాక్టర్లు మాత్రమే ఇసుక ను రవాణా చేయాల్సి ఉంటుంది. అధికార పార్టీకి చెందిన నాయకులు కొందరు అను మతుల ముసుగులో తమకు చెందిన ట్రా క్టర్లతో ఇసుక దందా చేస్తున్నారు. ఉదా హరణకు 100 పడకల దవాఖానకు ఇప్పటి వరకు కేవలం 9 ట్రాక్టర్ల ఇసుక మాత్రమే పోశారు. సదరు దవాఖాన పేరుతో తీసుకువస్తున్న ఇసుకను దర్జాగా ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
జోరుగా ఇసుక దందా అధికారులకు పట్టని వైనం
జోరుగా ఇసుక దందా సాగుతున్నా.. సంబంధిత శాఖాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పెద్దన్న పాత్ర పోషించే పోలీసులకు ఇసుక ట్రాక్టర్లు కనిపించకపోవడం వింతేనని పట్టణ వాసులు నోసళ్లు విరుస్తున్నారు. సామాన్యుడు ఎవరైనా పొరపాటున ఇసుకను తీసుకువస్తే.. డేగల్లా వాలే రక్షణ భటులకు ఎందుకో ఇసుక ట్రాక్టర్ల ర్యాలీ కనిపించడం లేదన్నదే శేష ప్రశ్న.
మైనర్లు డ్రైవర్లుగా..
చాలా ట్రాక్టర్లకు ఎలాంటి లైసెన్సు లేని వారు డ్రైవర్లుగా ఉన్నారు. మరికొన్ని ట్రాక్టర్లను మైనర్లు డ్రైవ్ చేస్తున్నారు. ఎలాంటి డ్రైవింగ్ అనుభవం లేకుండా దాదాపు 3 నుంచి 4 టన్నుల బరువున్న ట్రాక్టర్లను తమ ఇస్టానుసారంగా వేగంగా నడుపుతున్నారు. మైనర్లు అయితే పోటీ పడి మరీ వేగంగా ఇసుక ట్రాక్ట ర్లు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు.
ఇసుక ట్రాక్టర్లకు పైలెట్లు
ఇసుకను నింపుకొని వస్తున్న ట్రాక్టర్లకు రక్షణగా రెండు మోటర్ సైకిళ్లు ముందు పైలెట్‌గా వస్తుంటాయి. ఎవరు అడ్డుపడకుండా ట్రాక్టర్‌ను గమ్యం చేర్చడమే వీరి పని. కల్వకుర్తికి ట్రాక్టర్ రాగానే ఎక్కడ ఇసుక పోయాలనేది చిల్లర దేవుళ్ల నుంచి వీరికి సమాచారం వస్తుంది. అక్కడికి తీసుకుపోయి ఇసుకను డంప్ చేస్తారు. డబ్బులు వసూలు చేసుకుంటారు. ఎవరైనా అడ్డొస్తే వెంటనే చిల్లర దేవుళ్లకు సమాచారం వెళ్తుంది. వారు రంగంలోకి దిగుతారు.. అధికార దర్పాన్ని ప్రదర్శించి తమ పనిని చక్కబెట్టుకుంటారు.