మాగనూరు, నవంబర్ 19 : ఎంఎస్ఆర్ రైస్ మిల్లులో వే బ్రిడ్జి నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని మాగనూరు, వరూ రు, నేరడ్గం గ్రామాల రైతులు ఆరోపించారు. ఈ నెల 4, 5వ తేదీన ఇదే రైస్ మిల్లులో వే బ్రిడ్జి కాంటాలో అవకతవకలు ఉన్నాయని.. ఒకో రైతు నుంచి క్వింటాళ్ల కొద్ది ధాన్యం కటింగ్ చేస్తూ ట్రక్ షీట్లు రాసిస్తున్నట్లుగా రైతులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ రైస్ మిల్లుపై సంబంధిత సివిల్ సప్లయి, తూనికల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి ఆ రైస్ మిల్లు పై కేసు లు నమోదు చేశామని తెలిపారు.
అయినా ఈ రైస్‌మిల్ యజమాని ఏమాత్రం పట్టించుకోకుం డా కాంటాలో అవకతవకలకు పాల్పడుతున్నారని రైతులు మండిపడ్డారు. ఒక్కో రైతు నుంచి ఒక టన్ను నుంచి 10 క్వింటాళ్ల వరకు వరి ధా న్యాన్ని తకువ చూపి ట్రక్ షీట్లలో దాదాపు 30 నుంచి 40 బస్తాలు తకువ రాసి ఇస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం వరూర్ గ్రామానికి చెందిన మాషామొల్ల నరసింహ అనే రైతు 523 బ్యాగులతో కూడిన ఒక లారీని సుబ్రేశ్వర రైస్ మిల్లులో వే బ్రిడ్జిలో వేయిస్తే.. 31 టన్నుల 260 కిలోల వరి ధాన్యం వచ్చిందని.. ఇదే లా రీని ఎంఎస్ఆర్ ఇండస్ట్రీ వే-బ్రిడ్జిలో తూకం వే యిస్తే 31 టన్నుల 70 కిలోలుగా వచ్చిందని తెలిపాడు.

దాదాపు టన్నుకుపైగా వరి ధాన్యం తకువగా చూపించడంతో మళ్లీ ఈ తంతంగం బయటికి వచ్చింది. దీంతో వరూర్, నేరడగం గ్రామ రైతులు తిప్పయ్య, భాసర్, రవి, మైపాల్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, తాయ ప్ప, అశోక్‌రెడ్డి, కుర్వ తమ్మన్న తదితర రైతులు రైస్ మిల్ దగ్గరకు చేరుకొని వే బ్రిడ్జి నిర్వహణలో అవకతవకలు జ రుగుతున్నాయంటూ ఆధారాలతో రైస్ మిల్ యజమానిపై మండిపడ్డారు. కాంటాతో అవకతవకలకు పాల్పడి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నా సివిల్ సప్లయ్, తూనికల శాఖ అధికారులు ఈ మిల్లు యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
అయితే ఈ రైస్ మిల్ యజమాని మద్దూరు మండలంలో ఓ రైస్ మిల్ నిర్వహించేవాడని అకడ భారీ సామ్ చేసి అకడి నుంచి ఇకడికి వచ్చి రైస్ మిల్లు నిర్వహణ కొనసాగిస్తున్నాడని ఈ రైస్ మిల్ యజమానిపై పలుమార్లు కేసులు నమో దు అయినా ఆయన తీరు మాత్రం మారడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఈ మి ల్లును సీజ్ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సివిల్ సప్లై డీఎం సైదులు దృష్టికి తీసుకుపోయారు. స్పందించిన ఆయన ఎంఎస్ఆర్ రైస్ మిల్లులో వడ్ల కొనుగోళ్లు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో బుధవారం మధ్యాహ్నం మాగనూరు తాసీల్దార్ సురేశ్‌కుమార్ రైస్ మిల్లును పరిశీలించారు. ఆ రైస్ మిల్ యజమాని అప్పటికే తనకు కేటాయించిన క్వాంటిటీ పూర్తి చేసుకుని ఉండడంతో తాసీల్దార్ సురేశ్ ఆ రైస్ మిల్కు తాళం వేశారు. తూనికలు కొలతల శాఖ అధికారులు వచ్చి తనిఖీలు చేపట్టి కాంట సరి చేసిన తర్వాతే మళ్లీ వడ్లు కొనుగోలు చేయాలని అకడున్న సిబ్బందికి హెచ్చరించారు.