వాషింగ్టన్: బర్డ్ ఫ్లూకు చెందిన హెచ్ 5ఎన్5 ప్రపంచంలో తొలిసారి ఓ మానవుడికి సోకింది. అమెరికన్ ఆరోగ్య శాఖ అధికారులు గత వారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల ప్రారంభంలో ఓ మధ్య వయస్కుడు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా(బర్డ్‌ఫ్లూ)తో దవాఖానలో చేరా రు. వైద్య పరీక్షల్లో ఆయనకు ఏ(హెచ్5) ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకినట్లు తెలిసింది.
తదుపరి విశ్లేషణలో ఆ వైరస్ హెచ్5ఎన్5 సబ్టైప్ అని వెల్లడైంది. ఈ రకం వైరస్ గతంలో కేవలం జంతువులు, పక్షుల్లో మాత్రమే కనిపించింది. ఇది మానవుల్లో కనిపించడం ఇదే మొదటిసారి. ఈ వివరాలను వాషింగ్టన్ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ ధ్రువీకరించింది.