మరికల్, నవంబర్ 19 : మరికల్ మండలంలో రైతులకు సరిపడా గన్నీ బ్యాగులు అందించాలని పూసల్పాడు గ్రామస్తులు డిమాండ్ చేశారు. పూసల్పాడు రైతు వేదికకు బుధవారం 20 వేల గన్నీ బ్యాగులు రావడంతో రైతులు ఒక్కసారిగా అక్కడికి చేరుకొన్నారు. గ్రామానికి 70 వేల గన్నీ బ్యాగులు అవసరం కాగా గత వారం 17వేలు, బుధవారం 20 వేల బ్యాగులు ఇవ్వడం ఏంటనీ రైతులందరికీ సరిపడా గన్నీ బ్యాగులు ఇవ్వాలని వ్యవసాయాధికారి రహమాన్, తాసీల్దార్ రామ్కోటితో తీలేరు రైతులు వాగ్వాదానికి దిగారు.
తాసీల్దార్ రామ్‌కోటి కల్పించుకొని విడుతల వారీగా రైతులందరికీ గన్నీ బ్యాగులు అందజేస్తామని ఎవరూ ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. గన్నీ బ్యాగుల కోసం రైతులకు టోకెన్లు అందజేస్తామని, గన్నీ బ్యాగులు తీసుకున్న రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకోకుండా వెంటనే కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. అనంతరం తాసీల్దార్ పల్లెగడ్డ తండాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.