తుంగతుర్తి, ఫిబ్రవరి 28 : అంగన్వాడీ కేంద్రాన్ని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి మండలం బండరామారం గ్రామ సర్పంచ్ కోరుకొప్పుల నరేశ్ గౌడ్ అన్నారు. శనివారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పోషకాహారం సక్రమంగా అందించాలని, శుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. గ్రామంలో విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, ఆయా పాల్గొన్నారు.