సూర్యాపేట : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం సూర్యాపేట నియోజకవర్గంలో రైతులు, కార్యకర్తలతో పెద్దఎత్తున ధర్నా నిర్వహించినట్లు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు.
తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రకు తరలించేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుట్రలను ఎదుర్కోవాలని పార్టీ క్యాడర్‌కు జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇది కేసీఆర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర మాత్రమే కాదని, తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి, కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ కుట్ర జరుగుతున్నదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పజెప్పడం అంటే ఆ ప్రాజెక్టును పూర్తిగా మూసేయడమేనని పేర్కొన్నారు.
నిన్నటిదాకా సీబీఐ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్క రోజులోనే మాట ఎందుకు మార్చాడని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న శక్తులు ఏవో, వాటి ఉద్దేశాలు ఏమిటో.. ప్రజలకు తెలియజెప్పాలని పార్టీ శ్రేణులను కోరారు. ఇది కచ్చితంగా కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. కాళేశ్వరం కేసును కాంగ్రెస్ పార్టీ సీబీఐకి ఇచ్చినా, మరే ఏజెన్సీకి ఇచ్చినా భయపడేది లేదని సవాల్ చేశారు.
కేంద్రంతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటామని, బెదిరింపులు కేసులు తమ పార్టీకి కొత్త కాదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలైనా, త్యాగాలైనా చేస్తామని స్పష్టంచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం సూర్యాపేట నియోజకవర్గంలో రైతులు కార్యకర్తలతో పెద్ద ఎత్తున ధర్నా నిర్మించడం జరిగింది
తెలంగాణ వరప్రదాయిని కాలేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రకు… pic.twitter.com/p9oGeIrkTD— Jagadish Reddy G (@jagadishBRS) September 1, 2025