BRS Dharna | కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా సూర్యాపేటలో బీఆర్ఎస్ ధర్నా
BRS Dharna | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం సూర్యాపేట నియోజకవర్గంలో రైతులు, కార్యకర్తలతో పెద్దఎత్తున ధర్నా నిర్వహించినట్లు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు.
సూర్యాపేట : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం సూర్యాపేట నియోజకవర్గంలో రైతులు, కార్యకర్తలతో పెద్దఎత్తున ధర్నా నిర్వహించినట్లు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు.
తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రకు తరలించేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుట్రలను ఎదుర్కోవాలని పార్టీ క్యాడర్‌కు జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇది కేసీఆర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర మాత్రమే కాదని, తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి, కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ కుట్ర జరుగుతున్నదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పజెప్పడం అంటే ఆ ప్రాజెక్టును పూర్తిగా మూసేయడమేనని పేర్కొన్నారు.
నిన్నటిదాకా సీబీఐ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్క రోజులోనే మాట ఎందుకు మార్చాడని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న శక్తులు ఏవో, వాటి ఉద్దేశాలు ఏమిటో.. ప్రజలకు తెలియజెప్పాలని పార్టీ శ్రేణులను కోరారు. ఇది కచ్చితంగా కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. కాళేశ్వరం కేసును కాంగ్రెస్ పార్టీ సీబీఐకి ఇచ్చినా, మరే ఏజెన్సీకి ఇచ్చినా భయపడేది లేదని సవాల్ చేశారు.
కేంద్రంతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటామని, బెదిరింపులు కేసులు తమ పార్టీకి కొత్త కాదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలైనా, త్యాగాలైనా చేస్తామని స్పష్టంచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం సూర్యాపేట నియోజకవర్గంలో రైతులు కార్యకర్తలతో పెద్ద ఎత్తున ధర్నా నిర్మించడం జరిగింది
తెలంగాణ వరప్రదాయిని కాలేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రకు… pic.twitter.com/p9oGeIrkTD— Jagadish Reddy G (@jagadishBRS) September 1, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

