హైదరాబాద్: సీబీఐకి కాళేశ్వరం అప్పగించడం అంటే ప్రాజెక్టును మూసివేయడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి గోదావరి నదీ జలాలను ఆంధ్రకు తరలించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటామని, తమకు కేసులు కొత్తేమీ కాదని చెప్పారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులపాటు ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందన్నారు. తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి గోదావరి నదీ జలాలను ఆంధ్రకు తరలించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరంపై బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్రలను సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు. ఇది కేసీఆర్పై చేస్తున్న కుట్ర మాత్రమే కాదని, కాళేశ్వరాన్ని ఎండబెట్టి పక్క రాష్ట్రాలకు తరలించే కుట్ర అన్నారు.
సీబీఐకి కాళేశ్వరం అప్పగించడం అంటేనే ప్రాజెక్టును మూసివేయడమేనని చెప్పారు. నిన్నటిదాకా సీబీఐకి వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ ఒక్క రోజులోనే మాట మార్చారని మండిపడ్డారు. దీని వెనుక ఉన్న శక్తులు, వాటి ఉద్దేశాలు ఏమిటో ప్రజలకు తెలియాలన్నారు. ఇది కచ్చితంగా కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న కుట్ర, కపట నాటకమని ధ్వజమెత్తారు. సీబీఐకి గానీ, ఏ ఏజెన్సీకి ఇచ్చినా భయపడేది లేదని స్పష్టం చేశారు. కేంద్రంతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటామన్నారు. కేసులు తమకు కొత్తేమీ కాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని త్యాగాలైనా చేస్తామన్నారు.
✳️కాళేశ్వరం పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా ఈరోజు, రేపు రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్
✳️మండల మరియు జిల్లా కేంద్రాల్లో నేడు, రేపు వివిధ రూపాల్లో నిరసన తెలపనున్న బీఆర్ఎస్ శ్రేణులు
✳️ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు ఇతర… pic.twitter.com/Keqv5r6zDX
— BRS Party (@BRSparty) September 1, 2025