సూర్యాపేట : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారానికి నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పిలుపుతో రైతులు, యువకులు, బీఆర్ఎస్ శ్రేణులు వేలాదిగా తరలివచ్చారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ కోర్టు చౌరస్తా, పిఎస్ఆర్ సెంటర్, శంకర్ విలాస్ సెంటర్, ఎంజీ రోడ్, తెలంగాణ తల్లి చౌరస్తా, కొత్త బస్టాండ్ మీదుగా అంజనపురి జంక్షన్ వరకు కొనసాగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్పై తప్పుడు ప్రచారం మాని రైతులకు ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు.