MLA Padi Kaushik Reddy | హైదరాబాద్ : దళిత బంధు నిధులు ఇవ్వకుండా దళితులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి దళిత ద్రోహిగా మిగిలిపోతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్లో పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
దళితబంధుకు హుజురాబాద్ నియోజకవర్గాన్ని కేసీఆర్ పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. మొదటి విడత దళిత బంధు లబ్ధిదారులకు ఇచ్చాము. హుజురాబాద్ నియోజకవర్గంలో రెండవ విడత దళితబంధు ఇవ్వాలని నేను అసెంబ్లీలో అడిగాను. కానీ రెండవ విడత దళితబంధు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది. 33 జిల్లాల్లో దళితబంధు ఆపాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. హుజురాబాద్ నియోజకవర్గంలో దళితబంధు నేను ఆపానని అంటున్నారు. తెలంగాణలో రెండు లక్షల మందికి దళితబంధు ఇచ్చాము. దళితబంధుతో అనేక మందికి లబ్ది జరిగింది అని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు.
దళితబంధు విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు దళితులు వినతిపత్రం ఇచ్చారు. కేసీఆర్ పథకాలు మేము ఇవ్వమని మంత్రులు అంటున్నారు. దళితబంధు అడిగితే ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. దళిత మహిళలపై కేసులు పెట్టారు. హుజురాబాద్ ఏసీపీ దళితులను ఇబ్బంది పెడుతున్నారు. హుజూరాబాద్ ఏసీపీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. పోలీసుల బెదిరింపులకు మేము భయపడం. మేము రాష్ట్ర, జాతీయ ఎస్సీ కమిషన్ను కలుస్తాం. హుజురాబాద్ నియోజకవర్గంలో దళితులపై నమోదైన కేసులపై దళిత సంఘాలు స్పందించాలి. స్థానిక ఏసీపీ, సీఐలపై ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తాము. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు ఇచ్చే వరకు నేను పోరాటం చేస్తాను అని పాడి కౌశిక్ రెడ్డి తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి..
Chevella Road Accident | రంగారెడ్డి జిల్లాలో లారీ బీభత్సం.. ఆరుగురు కూరగాయల వ్యాపారులు మృతి
MLC Kavitha | కేసీఆర్ మొక్క కాదు.. కేసీఆర్ ఒక వేగు చుక్క : ఎమ్మెల్సీ కవిత