టెహ్రాన్: ఇరాన్‌పై శనివారం నాటి దాడుల్లో అమెరికా ‘ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐ’ను ఉపయోగించిందని వార్తలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ ఏజెన్సీల్లో ఆంథ్రోపిక్ ఏఐ వాడకాన్ని ట్రంప్ సర్కార్ నిషేధించిన కొద్ది గంటల్లోనే.. అమెరికా సైన్యం ఈ ఏఐ టెక్నాలజీ వాడినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇరాన్లో 30కిపైగా స్థావరాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఇందులో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నివాస భవనం కూడా ఉంది. పశ్చిమాసియాలోని యూఎస్ సెంట్రల్ కమాండ్ సహా ప్రపంచవ్యాప్తంగా అమెరికా మిలిటరీ కమాండ్స్ ‘ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐ’ టూల్‌ను నిఘా అంచనాలు, టార్గెట్స్ గుర్తింపు, యుద్ధ దృశ్యాలను అనుకరించటం కోసం వాడుతున్నాయి.