పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో ‘స్లమ్‌డాగ్’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ‘33 టెంపుల్ రోడ్’ ఉపశీర్షిక. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఈ వేసవిలోనే రిలీజ్ కానుంది. ఈ జోరుని ఇలాగే కొనసాగిస్తూ తర్వాతి సినిమాకు చెందిన ప్రయత్నాలను కూడా మొదలుపెట్టారు పూరీ. ఈ సారి కూడా తమిళ హీరోతోనే ఆయన సినిమా ఉంటుందట. ఆ హీరో ఎవరో కాదు.. సూర్య. ఈ కాంబినేషన్ ఆల్మోస్ట్ ఫిక్సయిందని చెన్నై టాక్. ఇటీవలే సూర్యకు పూరీ కథ వినిపించారట.
కథ విని సూర్య పచ్చజెండా ఊపేశారట. నిజానికి సూర్య కూడా పూరీ అభిమానే. ‘బిజినెస్‌మాన్’ కథను పూరీ ముందు సూర్యకే వినిపించారు. ఆయన కూడా ఓకే అన్నాడు. కానీ కొన్ని కారణాలవల్ల ఆ సినిమా ముందుకు సాగలేదు. అందుకే ఆ కథలో హీరో మారినా, పాత్ర పేరును మాత్రం పూరీ మార్చలేదు. అందులో మహేష్ పాత్ర పేరు ‘సూర్య’. ఏదేమైనా ఇన్నాళ్లకు ఇలా ఈ కాంబినేషన్ సెట్టయింది. ఈ ప్రాజెక్ట్‌కి చెందిన ఆధికారిక ప్రకటన రావాల్సివుంది.