Chevella Road Accident | రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. కూరగాయలు అమ్ముకుంటున్న వారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులంతా కూరగాయలు అమ్ముకుంటున్న వారేనని పోలీసులు తెలిపారు. సుమారు 50 మందికి కాళ్లు, చేతులు విరగడంతో అక్కడ భీతావహ పరిస్థితి నెలకొంది. బాధితులంతా నడవలేని పరిస్థితిలో ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక లారీ వేగానికి అక్కడున్న ఓ భారీ వృక్షం కూడా కుప్పకూలింది. లారీ క్యాబిన్లో డ్రైవర్ చిక్కుకున్నాడు. లారీ వేగాన్ని చూసి స్థానికులు పరుగులు పెట్టారు.
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | కేసీఆర్ మొక్క కాదు.. కేసీఆర్ ఒక వేగు చుక్క : ఎమ్మెల్సీ కవిత
Harish Rao | రేవంత్ రెడ్డి అపరిచితుడు.. ఇలాంటి నాయకులను నమ్మి మోసపోవద్దు : హరీశ్‌రావు