Harish Rao | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి అపరిచితుడు అని, ఇలాంటి నాయకులను నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు రాష్ట్ర ప్రజలకు సూచించారు. చైతన్యవంతులైన ప్రజలు ఇకనైనా ఇటువంటి రెండు నాల్కల ధోరణి గల నాయకులను నమ్మి మోసపోవద్దని, మోసపోతే ఎంతో గోస పడుతరని చెప్పాలనేది నా ఆరాటం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. రాజకీయ నాయకులను ప్రజలు నిశితంగా పరిశీలిస్తుంటారు. రాజకీయ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని బాధ్యతగా మాట్లాడాలి.. మెలగాలి. ప్రజలు పిచ్చోళ్లు మనం ఏదైనా మాట్లాడొచ్చు.. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడొచ్చు అని ఆయన మాట్లాడుతున్నాడు. మోసం చేయడం మాకు అలవాటు, మోసపోవడం ప్రజలకు అలవాటు అని నిస్సంకోచంగా చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇక్కడ డుబల్ స్టాండర్డ్ లేదు.. ఆయన మనసులో ఉన్నది చెప్పినట్టు ఉండు. నా ప్రయత్నం అంతా రేవంత్ నిజ స్వరూపం ప్రజలకు చూపించాలన్నదదే తపన అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఈ ఏడాది కాలంలో తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.. రైతుబంధు, బతుకమ్మ చీరలు, పెన్షన్లు చాలా కోల్పోయారు. తెలంగాణ ప్రజలకు ఈ ఏడాది కాలంలో అనుభవంలోకి వచ్చింది మోసం, దగా. రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్న రేవంత్‌ను చూస్తే పిల్లలు చెడిపోతారని చానెల్స్ మారుస్తున్నారు. రేవంత్ రెడ్డి భాష, తీరుకు భయపడుతున్నారు తల్లిదండ్రులు. మా పిల్లల మీద ప్రభావం పడే అవకాశం ఉందని బాధపడుతున్నారు. రేవంత్ రెడ్డిని నమ్మితే అన్నవస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టు అయింది పరిస్థితి. ఈ ఏడాది పాలనలో ఎడతెగని వంచనకు ఇవన్నీ నిలువెత్తు నిదర్శనాలు. ఇది ఆత్మ వంచన చేసుకోవడమే. ప్రజలకు మాటిస్తే నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చావు. కానీ ఇప్పుడు మాట మారుస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలి అని హరీశ్‌రావు సూచించారు.
ఇవి కూడా చదవండి..
Constable Nagamani | కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో ట్విస్ట్.. వెలుగులోకి కొత్త కోణం
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి రెండు నాల్కల ఆణిముత్యాలు.. విడుదల చేసిన హరీశ్‌రావు