Constable Nagamani | కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో ట్విస్ట్.. వెలుగులోకి కొత్త కోణం
కానిస్టేబుల్ నాగమణి (Constable Nagamani) హత్యలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత పరువు హత్య అనుకున్నప్పటికీ కారణాలు వేరే ఉన్నాయని తెలుస్తున్నది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణి సోమవారం ఉదయం హత్యకు గురయ్యారు.
ఇబ్రహీంపట్నం: కానిస్టేబుల్ నాగమణి (Constable Nagamani) హత్యలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత పరువు హత్య అనుకున్నప్పటికీ కారణాలు వేరే ఉన్నాయని తెలుస్తున్నది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణి సోమవారం ఉదయం హత్యకు గురయ్యారు. ఇది పరువు హత్య అని తొలుత భావించినప్పటికీ పోలీసుల విచారణలో ఆస్తి గొడవలే కారణమని తెలస్తున్నది.
రాయపోల్‌కు చెందిన నాగమణి గత నెల 1న.. అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ను యాదగిరిగుట్టలో కులాంతర వివాహం చేసుకున్నది. అనంతరం వారు హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో నాగమణి తన సొంత గ్రామానికి వెళ్లారు. అయితే సోమవారం ఉదయం స్కూటీపై డ్యూటీకి వస్తుండగా.. కారులో వెంబడించిన తమ్ముడు పరమేష్ ఆమెను ఢీకొట్టాడు. అనంతరం కొడవలితో మెడ నరికి చంపాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్తి కోసమే చంపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
నాగమణికి తల్లిదండ్రులు లేకపోవడంతో పరమేశ్ అన్నీ తానే చూసుకున్నాడు. కాగా ఆమెకు ఇదివరకే వివాహమై విడాకుల కూడా అయ్యాయి. దీంతో తమ వారసత్వంగా వచ్చిన భూమిని మొదటి వివాహం తర్వాత తమ్ముడికి ఇచ్చేసింది. అయితే రెండో పెండ్లి చేసుకున్న తర్వాత.. ఆ భూమిలో వాటా ఇవ్వాలని గత కొంతకాలంగా తమ్ముడిపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో అక్కపై కోపంతో ఉన్న పరమేశ్ ఆమెను హత్యచేశాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

