Monsoon Parliament Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Monsoon Parliament Session) మంగళవారం రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి. ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే దిగువ సభ (Lok Sabha) వాయిదా పడింది. సభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వెల్లోకి దసుకొచ్చారు. దీంతో సభను స్పీకర్ ఓంబిర్లా గంట పాటూ వాయిదా వేశారు. సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అటు ఎగువ సభ (Rajya Sabha)లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. సభ ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వాయిదా తీర్మానాలపై చర్చకు డిమాండ్ చేశారు. దీంతో విపక్ష ఎంపీల ఆందోళనలతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు.
#WATCH | Lok Sabha adjourned till 12 noon amid sloganeering by Opposition MPs pic.twitter.com/KbCpE3uGV0
— ANI (@ANI) July 22, 2025
#WATCH | Rajya Sabha adjourned till 12 noon amid sloganeering by Opposition MPs#MonsoonSession pic.twitter.com/QPDfJK5OYd
— ANI (@ANI) July 22, 2025
Also Read..
Jairam Ramesh | ధన్ఖడ్ రాజీనామా వెనుక లోతైన కారణం ఉండొచ్చు : జైరాం రమేష్
Next Vice President | ధన్ఖడ్ రాజీనామా.. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరంటే?