ఐనవోలు( హనుమకొండ): గ్రామ పంచాయతీ కార్మికులకు పర్మినెంట్ ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బొట్ల చక్రపాణి, జిల్లా ఆధ్యక్షుడు గబ్బెట యాకయ్యలు డిమాండ్ చేశారు. ఐనవోలు మండల కేంద్రంలోని ఆంగడి సెంటల్లో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర ఐదవ మహాసభ వాల్ పోస్టర్ వారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీపీ కార్మికులకు మల్టీపర్సస్ విధానాన్ని రద్దు చేసి, పాత కేటగిరీలకు కొనసాగించాలన్నారు. ప్రతినెల ఐదవ తేది లోపు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని కారోబార్లకు బిల్ కలెక్టర్లుగా స్పెషల్ స్టేటస్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24, 25వ తేదీల్లో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో జరిగే తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఐదవ మహాసభకు జీపీ కార్మికుల పెద్ద సంఖ్యలో హజరై జయపద్రం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు గాడె కుమారస్వామి, బొక్కల సురేందర్, నాయకులు ఎండీ షబ్బీర్, కొత్తూరు ఏసోబు, ఎం శ్రీనివాస్, బీ చంద్రయ్య, కే రవి, ఎలిషమ్మ, లచ్చమ్మ, పూల, రజిత, కొమురయ్య తదతరులు పాల్గొన్నారు