Viral News | హైదరాబాద్ పాతబస్తీలోని దబీర్పురా పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో స్థానికులంతా షాక్కు గురయ్యారు. ఓ యువకుడు పలువురికి ఉచితంగా జ్యూస్ పంపిణీ చేశాడు. పలు దుకాణాలు, పలు దుకాణాలు, అపార్టుమెంట్ల చుట్టూ తిరిగి 12 మందికి జ్యూస్ ఇచ్చాడు. జ్యూస్ తాగినవారిలో వారంతా కొద్దిసేపటికే అకస్మాత్తుగా నిద్రలోకి వెళ్లిపోయారు. దాదాపు కొద్ది గంటల తర్వాత నిద్ర మేల్కొన్నారు. నిద్ర నుంచి మేలుకున్నాక ఏం జరుగుతుందో గుర్తించలేకపోయారు. పలువురు ఉదయానికి లేచినా సాయంత్రం వరకూ తాము ఏమి చేసారో తెలియకుండా అర్థం కాని స్థితిలోనే అయోమయానికి గురవుతూ విచిత్రంగా ప్రవర్తించారు.
దాంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం జ్యూస్ తాగిన వారి పరిస్థితి నిలకడగానే ఉంది. అయితే, ఈ విషయంపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకుడి కోసం ఆరా తీస్తున్నారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. సదరు యువకుడి చిత్రాలు దొరికినట్లు తెలుస్తున్నది. అయితే, సదరు యువకుడు జ్యూస్లో ఏమైనా కలిపాడా? అని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ పరీక్షలు చేయించిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సదరు యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.