బచ్చన్నపేట అక్టోబర్ 16 : మల్లు స్వరాజ్యం కాలనీ గుడిసెలు వేసుకొని గత ఐదు సంవత్సరాలుగా నివసిస్తున్న నిరుపేద గుడిసె వాసులకు కనీస సౌకర్యాలు కల్పించాలని సిపిఎం బచ్చన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో మల్లు స్వరాజ్యం నగర్ కాలనీ నుండి ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించచారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి మొకు కనుక రెడ్డి మాట్లాడారు. గత ఐదు సంవత్సరాలుగా మల్లు స్వరాజ్యం కాలనీలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న గుడిసె వాసులకు కనీస సౌకర్యాలు కరెంటు, మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు.
కనీసం మంచినీటి వసతి లేక గుడిసె వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాజ్యాంగబద్ధంగా అందాల్సిన కనీస సౌకర్యాలు పేదలకు అందకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి కనీస సౌకర్యాలు వెంటనే కల్పించి పేదలను ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు. లేదంటే పేదలను సమీకరించి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు.
అనంతరం గుడిసె వాసులు స్థానిక తహసీల్దార్‌కు దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు పర్వతం నర్సింహులు, సిపిఎం నాయకులు పొన్నాల రాజవ్వ, తాడూరి వెంకటమ్మ, చొక్కాం సులోచన, కిష్టయ్య చంద్రం, కస్తూరి సిద్ధులు బాలరాజు, గంధమల నరసింహస్వామి, రాళ్ల బండి కనకాచారి,గంధ మల్ల మనోహర్,సుహాసిని మురళీకృష్ణ, గిరిజన సంఘం జిల్లా నాయకులు సురేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.