బచ్చన్నపేట అక్టోబర్ 16 : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని చేర్యాల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నల్లనాగుల శ్వేత అన్నారు. గురువారం బచ్చన్నపేట మండలంలోని వివిధ గ్రామాలలో ఐకేపి సెంటర్లతో పాటు పిఏసీఎస్ సెంటర్లను ప్రారంభించి ఆమె మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. వరి కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా కొనుగోలు జరపాలని, రైతులను ఎవరైనా ఇబ్బందులు పెడితే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు.
ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేదే. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ కింది హరిబాబు గౌడ్, ఎండి మసూద్, అల్వాల ఎల్లయ్య, జింగిటి విద్యానాథ్, మాసాపేట రవీందర్ రెడ్డి, ప్రకాష్, జిల్లెల్ల దయాకర్ రెడ్డి, కొండయ్య, గొల్లపల్లి మల్లేష్ గౌడ్, జ్యోతి భాస్కర్, ఆముదాల మల్లారెడ్డి, ఇంద్రయ్య, భాస్కర్ రెడ్డి, కిష్టయ్య, రమేష్, సీసీలు విజయలక్ష్మి, యాదగిరి, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.