Funeral | అతనో రిటైర్డ్ IAF ఆఫీసర్.. సామాజిక సేవాకార్యకర్త.. ఎన్నో మంచి పనులు చేశాడు. ప్రజల గుండెల్లో ఆయనకు మంచి స్థానం ఉంది. అయితే, ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అనుకున్నాడు. ఇంత సేవ చేసిన తనకు ఎంత గౌరవం ఇస్తారో, తన పట్ల ఎంత ఆప్యాయత చూపుతారో తెలసుకుకోవాలన్న కోరిక పుట్టింది. అందుకోసం తాను చనిపోయినట్లు డ్రామా క్రియేట్ చేశాడు. అంత్యక్రియలను (funeral) కూడా స్వయంగా నిర్వహించుకున్నాడు. శ్మశానవాటిక వరకూ ఊరేగింపుగా వెళ్లి.. అక్కడ అందరికీ షాకిచ్చాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రం గయా జిల్లాలో చోటు చేసుకుంది.
74 ఏండ్ల మోహన్‌లాల్ అనే వ్యక్తి వైమానిక దళంలో పనిచేశాడు (former Air Force soldier). గయాలోని కొంచి గ్రామంలో నివాసం ఉంటున్నారు. అతను ఓ సామాజిక కార్యకర్త కూడా. సామాజిక సేవలో భాగంగా ప్రజలకు ఎంతో సేవ చేశాడు. ప్రజల అవసరాలను తీర్చాడు. సొంత డబ్బుతో ఎన్నో మంచి పనులు చేశాడు. స్థానికంగా అతనికి మంచి పేరుంది. ప్రజలు ఆయనకు ఎంతో గౌరవమిస్తారు. అయితే, చనిపోయిన తర్వాత తనను చివరి చూపుకు ఎంత మంది వస్తారో తెలుసుకోవాలనుకున్నాడు. దీంతో అన్ని ఆచారాలనూ పాటిస్తూ స్వయంగా అంత్యక్రియలు నిర్వహించుకున్నాడు. ఈ అంత్యక్రియలకు వందలాది మంది ప్రజలు హాజరయ్యారు.
డప్పు వాయిద్యాలు, బాణాసంచా కాలుస్తూ ఊరేగింపుగా శ్మశాన వాటిక వరకూ చేరకున్నాడు. అక్కడ తన దిష్టిబొమ్మను దహనం చేశాడు. అంత్యక్రియలకు హాజరైన వారికి ప్రత్యేకంగా విందు కూడా ఏర్పాటు చేశాడు. అతడి చర్యతో అక్కడి వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ప్రజలు తనకు ఎంత గౌరవం, ఆప్యాయత ఇస్తారో తెలుసుకునేందుకు ఇలా చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటన ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
Also Read..
Bengaluru | పన్ను కట్టబోమంటూ ప్రజలు వార్నింగ్.. బెంగళూరు రోడ్ల సమస్యపై డీకే శివకుమార్ స్పందన
Ilaiyaraaja | ఇళయరాజా స్టూడియోకి బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్
Massive Traffic Jam | భారీ ట్రాఫిక్ జామ్.. 12 గంటలుగా చిక్కుకుపోయిన 500 మంది విద్యార్థులు