Ilaiyaraaja | తమిళనాడు రాష్ట్రంలో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threats) కలకలం రేపాయి. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా (Ilaiyaraaja) స్టూడియోకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. దాంతోపాటూ పలు విదేశీ ఎంబసీలకు కూడా బెదిరింపులు వచ్చాయి.
చెన్నై (Chennai)లోని టీ నగర్లో (T Nagar) గల ఇళయరాజా స్టూడియోకు మంగళవారం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. స్టూడియోలో పేలుడు పరికరాన్ని అమర్చినట్లు అందులో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. దీంతో దాన్ని నకిలీ బెదిరింపుగా తేల్చారు.
ఇక ఇళయరాజా స్టూడియోతోపాటూ చెన్నైలోని అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, థాయిలాండ్, శ్రీలంక, సింగపూర్ కార్యాలయాలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈ మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు ఆయా కార్యాలయాల వద్ద కూడా తనిఖీలు చేపట్టారు. కాగా, తమిళనాడులోని పలువురు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలకు గత కొన్నిరోజులుగా వరుస బాంబు బెదిరింపులు (Bomb Threats In Chennai) వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీవీకే చీఫ్, ప్రముఖ నటుడు విజయ్, ప్రముఖ నటులు త్రిష, నయనతార నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి, డీజీపీ ఆఫీసుకి, రాజ్‌భవన్‌కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి.
Also Read..
Massive Traffic Jam | భారీ ట్రాఫిక్ జామ్.. 12 గంటలుగా చిక్కుకుపోయిన 500 మంది విద్యార్థులు
Bihar Assembly Elections | బీహార్ ఎన్నికలు.. తొలి జాబితా రిలీజ్ చేసిన జేడీయూ
Ban on Hindi | హిందీపై ఉక్కుపాదం.. పాటలు, సినిమాలపై తమిళనాడులో బ్యాన్..!