Ban on Hindi | హిందీపై ఉక్కుపాదం.. పాటలు, సినిమాలపై తమిళనాడులో బ్యాన్..!
Ban on Hindi | హిందీ భాషకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Ban on Hindi | త్రిభాషా సూత్రంపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu) మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ విభేదాల నేపథ్యంలో విద్యా విధానాన్ని మార్చిన సీఎం స్టాలిన్ తాజాగా రాష్ట్రంలో హిందీ భాషకు వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో హిందీ భాషను నిషేధించే (ban on Hindi) లక్ష్యంతో అసెంబ్లీలో ఓ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. ఈ ప్రతిపాదిత చట్టంపై చర్చించేందుకు నిన్న రాత్రి న్యాయ నిపుణులు, ప్రభుత్వం మధ్య అత్యవసర సమావేశం జరిగినట్లు సమాచారం. రాష్ట్రం అంతటా హిందీ హోర్డింగ్‌లు, బోర్డులు, హిందీ సినిమాలు, హిందీ పాటలను నిషేధించే లక్ష్యంతో ఈ బిల్లును రూపొందించినట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాజ్యాంగానికి లోబడే దీన్ని రూపొందించినట్లు సమాచారం.
తమిళనాడులో హిందీని బలవంతంగా రుద్దడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని డీఎంకే సహా పలు పార్టీలు ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. తమిళనాడుపై బలవంతంగా హిందీ భాషను రుద్దడానికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర శాసనసభ ఇటీవలే ఓ తీర్మానం చేసింది. అధికార భాషలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదికలోని సిఫారసులను అమలు చేయవద్దని ఆ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సెప్టెంబర్ 9న రాష్ట్రపతికి ఈ కమిటీ నివేదించిన సిఫారసులు తమిళంసహా ఇతర రాష్ర్టాల భాషలకు, వాటిని మాట్లాడే ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ సీఎం ఎంకే స్టాలిన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంతోపాటు హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ర్టాలకు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇచ్చిన హామీకి పార్లమెంటరీ కమిటీ సిఫారసులు వ్యతిరేకంగా ఉన్నాయని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. దీన్ని అసెంబ్లీ ఆమోదించింది.
Also Read..
Green Crackers | గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు..?
Air Pollution | దీపావళికి ముందే ఢిల్లీలో పెరిగిన వాయుకాలుష్యం.. ఏక్యూఐ ఎంతంటే..?
Postal Services | అమెరికాకు అన్ని పోస్టల్ సేవలు పునఃప్రారంభం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

