Postal Services | అమెరికాకు అన్ని రకాల తపాలా సేవలు (Postal Services) తిరిగి ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి ఆ సేవలను పునఃప్రారంభించినట్లు భారతీయ తపాలా శాఖ మంగళవారం ప్రకటించింది. ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఆగస్టు 25 నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే, రెండు నెలల తర్వాత అమెరికాకు బుధవారం నుంచి అన్ని రకాల పోస్టల్ సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు భారతీయ తపాలా శాఖ తాజాగా ప్రకటించింది.
అంతర్జాతీయ వాణిజ్య సరకుల బట్వాడాదారులపై(కొరియర్లపై) అదనపు సుంకాలపై అమెరికా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఆగస్ట్ 25 నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇది భారత తపాల శాఖ ద్వారా వెళ్ళే కొరియర్లకు వర్తించనప్పటికీ.. మార్పులు చేయడం కోసం ఇండియన్ తపాలా శాఖ ఆగస్టులో సర్వీసులను ఆపేసింది. ఇప్పుడు రెండు నెలల తర్వాత వీటిని తిరిగి పునరుద్ధరించింది.
కొత్త నిబంధనల ప్రకారం అమెరికాకు తపాలా శాఖ ద్వారా బట్వాడా అయ్యే సరకులపై ప్రకటిత కన్సైన్మెంట్ విలువలో 50 శాతాన్ని కస్టమ్స్ సుంకంగా చెల్లించాలి. దీని వలన భారత్ నుంచి ఎగుమతి చేసేవారికి ఎటువంటి నష్టమూ వాటిల్లదని తపాలాశాఖ చెబుతోంది. ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారులు, చేతివృత్తులవారు, ఈ-కామర్స్ ఎగుమతిదారులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని వివరించింది. మన పోస్టల్ సుంకాల్లో మార్పు ఉండదనీ, దీనివల్ల ఎంఎస్ఎంఈలు ప్రయోజనం పొందుతాయనీ తెలిపింది.
Also Read..
Amazon | అమెజాన్లో మరోసారి లేఆఫ్స్.. హెచ్ఆర్ విభాగంపై ప్రభావం..!
Ravi Naik: గోవా మాజీ సీఎం రవి నాయక్ కన్నుమూత