Amazon | టెక్ ప్రపంచంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కృత్రిమ మేధ (ఏఐ) రాక, ఆర్థిక మందగమనం, వ్యయ నియంత్రణ చర్యల పేరిట టెక్ దిగ్గజాలు మెటా, ఫేస్బుక్, అమెజాన్, గూగుల్ సహా పలు కంపెనీలు లేఆఫ్స్‌కు తెగబడుతున్నాయి. ఆయా సంస్థలు గత ఐదేళ్లలో వేల సంఖ్యలో ఉద్యోగులకు (employees) లేఆఫ్స్ ప్రకటించాయి.
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. తాజారౌండ్లో తన హ్యూమన్ రిసోర్సెస్ విభాగంలో (HR staff) 15% వరకు ఉద్యోగుల్ని ఇంటికి (Amazon Layoffs) పంపించేందుకు రెడీ అయ్యింది. హెచ్ఆర్ విభాగంతోపాటూ ఇతర విభాగాలపై కూడా లేఆఫ్స్ ప్రభావం పడనున్నట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
కాగా, అమెజాన్ సీఈఓగా ఆండీ జస్సీ (Andy Jassy) బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కంపెనీ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా వరుసగా ఉద్యోగుల తొలగింపులను ప్రకటిస్తూనే ఉంది. సంస్థ వ్యయ తగ్గింపు చర్యల్లో భాగంగా 2022లో ఏకంగా 27,000 మంది ఉద్యోగులను తొలగించింది.
Also Read..
టెక్ మహీంద్రా ప్రాఫిట్ డౌన్
రెండోరోజూ నష్టాల్లోనే.. భారీగా పడిపోయిన స్టాక్ మార్కెట్లు