ముంబై, అక్టోబర్ 14: ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,194.5 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,250 కోట్ల లాభంతో పోలిస్తే 4.44 శాతం తగ్గింది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.13,313 కోట్ల నుంచి రూ.13,995 కోట్లకు పెరిగినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. గత త్రైమాసికంలో సంస్థ 816 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నది. సంస్థలో ఉద్యోగుల సంఖ్య 1,559 తగ్గి 1.52 లక్షలకు పరిమితమయ్యారు. మరోవైపు, రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.15 మధ్యంతర డివిడెండ్‌ను సంస్థ ప్రకటించింది.