Green Crackers | దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచా (Green Crackers) అమ్మకాలకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ నేపథ్యంలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు అని తెలిపింది. ఈ మేరకు అక్టోబర్ 18 నుంచి 21వ తేదీ వరకు గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలకు అనుమతిచ్చింది. అయితే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఆ బాణాసంచా కాల్చుకోవచ్చు అని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అసలు గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
దీపావళి పండగ (Diwali Festival) సందర్భంగా ప్రజలు క్రాకర్స్ (Cracker) కాలుస్తుంటారు. ఆ బాణసంచా తయారీలో అనేక రకాల రసాయన పదార్థాలను ఉపయోగిస్తారు. వీటి వల్ల వాయు, శబ్ద కాలుష్యంతో పాటూ ఆరోగ్యానికి మంచిది కాదు. వాటికి బదులు గ్రీన్ కాకర్స్ మంచిది. ఈ బాణసంచా కాల్చడం ద్వారా మీరు దీపావళిని సంపూర్ణంగా ఆస్వాదించొచ్చు. వీటివల్ల వాయు, శబ్ద కాలుష్యం కూడా ఉండదు. గ్రీన్ క్రాకర్స్ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, పార్టిక్యులేట్ మ్యాటర్ వంటి తక్కువ కాలుష్య కారకాలను ఉత్పత్తి చేసే విధంగా తయారు చేస్తారు. ఇవి తక్కువ పొగను విడుదల చేస్తాయి. వీటిని కాల్చడం వల్ల ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందీ కలగదు.
Also Read..
Air Pollution | దీపావళికి ముందే ఢిల్లీలో పెరిగిన వాయుకాలుష్యం.. ఏక్యూఐ ఎంతంటే..?
Green Crackers: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలు, వినియోగానికి సుప్రీంకోర్టు అనుమతి
Postal Services | అమెరికాకు అన్ని పోస్టల్ సేవలు పునఃప్రారంభం