Air Pollution | దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) ఎక్కువైంది. దీపావళి (Diwali) పండుగకు ముందే వాయు నాణ్యత క్షీణించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. బుధవారం ఉదయం రాజధాని ప్రాంతంలో వాయు నాణ్యత సూచిక 300 దాటింది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Central Pollution Control Board) ప్రకారం.. ఉదయం 7 గంటల సమయానికి నోయిడాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 369గా, ఘజియాబాద్‌లో ఏక్యూఐ స్థాయిలు 320-325 మధ్య నమోదయ్యాయి. ఫరీదాబాద్‌లో ఏక్యూఐ 267, ఆనంద్ విహార్‌లో 347, వజీర్‌పూర్‌లో 296, ద్వారకా సెక్టార్ 8లో 269గా ఏక్యూఐ నమోదైంది. రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. వాయుకాలుష్యం పెరుగుతున్న కారణంగా ఎన్సీఆర్లో తొలి దశ ఆంక్షలు అమలు చేయాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అధికారులను ఆదేశించింది.
ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు.
Also Read..
Green Crackers: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలు, వినియోగానికి సుప్రీంకోర్టు అనుమతి
Postal Services | అమెరికాకు అన్ని పోస్టల్ సేవలు పునఃప్రారంభం
Amazon | అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్.. హెచ్ఆర్ విభాగంపై ప్రభావం..!