Bihar Assembly Elections | బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly Elections) సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ 71 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా జేడీయూ (JDU) ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. 57 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఇవాళ విడుదల చేసింది. రాజ్‌గిర్ నుంచి కౌశల్ కిషోర్, కల్యాణ్‌పూర్ నుంచి మహేశ్వర్ హజారా, మోర్వా నుంచి విద్యాసాగర్ నిషాద్, సోన్బస్రా నుంచి రత్నేశ్ సదా, మొకమా నుంచి అనంత్ సింగ్, మీనాపూర్ నుంచి అజయ్ కుశ్వాహ, ఎక్మా నుంచి ధమల్ సింగ్ బరిలోకి దిగుతున్నారు.
బీహార్ శాసన సభ ఎన్నికల కోసం ఎన్డీయే పక్షాల మధ్య సీట్ల పంపకం ఖరారైన విషయం తెలిసిందే. మొత్తం నియోజకవర్గాలు 243 కాగా, బీజేపీ, జేడీయూ చెరి 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ (ఆర్) 29 స్థానాల్లో, ఆర్ఎల్ఎం, హెచ్ఏఎం (ఎస్) చెరి ఆరు స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి. బీహార్ ఎన్నికల ఇన్‌ఛార్జి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ వివరాలను ఆదివారం ప్రకటించారు. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. తొలి దశ నవంబర్ 6, రెండో దశ నవంబర్ 11 తేదీల్లో జరగనున్నాయి. అదేనెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు విడుదల చేయనున్నారు.
Also Read..
Ban on Hindi | హిందీపై ఉక్కుపాదం.. పాటలు, సినిమాలపై తమిళనాడులో బ్యాన్..!
Green Crackers | గ్రీన్ క్రాకర్స్ అంటే ఏంటి.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు..?
Air Pollution | దీపావళికి ముందే ఢిల్లీలో పెరిగిన వాయుకాలుష్యం.. ఏక్యూఐ ఎంతంటే..?