Bengaluru | భారీ వర్షాలు (Heavy rain), నిర్వహణ లోపాలతో కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru) లో గుంతలమయమైన రోడ్లపై (potholes) సర్వత్రా చర్చ జరుగుతోంది. నిత్యం ట్రాఫిక్ జామ్‌లు, గుంతలు నిండిన రోడ్లమీద ప్రయాణంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అధ్వాన్నంగా మారిన రహదారులు, మౌలిక సదుపాయాలపై నగరవాసులు (Bengaluru Citizens) ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. గుంతల రోడ్లతో విసిగిపోయిన స్థానికులు కర్ణాటక సర్కారుపై విమర్శలు చేస్తున్నారు. ఇకపై తాము ఆస్తి పన్నులు చెల్లించేది లేదంటూ తెగేసి చెబుతున్నారు. ప్రజల బెదిరింపుల నేపథ్యంలో ఈ సమస్యపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) తాజాగా స్పందించారు.
రోడ్లపై గుంతలు పూడ్చే పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. అంతేకాదు నగరంలో ట్రాఫిక్ సమస్యను సరిచేసేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ‘బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సజావుగా సాగేలా ప్రాధాన్యత ఇస్తున్నాం. నగరంలోని వివిధ ప్రాంతాల్లో గుంతలు పడిన రోడ్లను తారుతో పూడ్చే పనులు వేగంగా జరుగుతున్నాయి’ అని ఎక్స్ పోస్టులో డీకే రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
గుంతలు పడిన రోడ్లు, ఎటు చూసినా చెత్తకుప్పలు దర్శనమిస్తున్న బెంగళూరు దుస్థితి గురించి నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది. బెంగళూరును సందర్శించిన ఓ విదేశీ అతిథి నుంచి తనకు ఎదురైన ప్రశ్నను బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా నెటిజన్లతో పంచుకున్నారు. బెంగళూరు రోడ్లు మాత్రమే కాదు వీధుల్లో పేరుకుపోయిన చెత్తను గురించి చైనా నుంచి వచ్చిన ఆ సందర్శకురాలు వేసిన ప్రశ్నను భారతీయుల దృష్టికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. బయోకాన్ పార్కుకు వ్యాపారం నిమిత్తం ఓ సందర్శకురాలు వచ్చారు. అప్పుడు ఆమె నాతో ‘రోడ్లు ఎందుకు ఇంత అధ్వానంగా ఉన్నాయి.. ఎటుచూసినా ఎందుకు ఇంత చెత్త ఉంది..? పెట్టుబడులకు మద్దతు ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదా..? నేను చైనా నుంచి వచ్చాను. సానుకూల పవనాలు వీస్తున్న తరుణంలో భారత్ కలసికట్టుగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు’ అని అన్నారు అని కిరణ్ మజుందార్ షా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో బెంగళూరు దుస్థితి మరోసారి వార్తల్లో నిలిచింది.
Also Read..
Ilaiyaraaja | ఇళయరాజా స్టూడియోకి బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్
Massive Traffic Jam | భారీ ట్రాఫిక్ జామ్.. 12 గంటలుగా చిక్కుకుపోయిన 500 మంది విద్యార్థులు
Ban on Hindi | హిందీపై ఉక్కుపాదం.. పాటలు, సినిమాలపై తమిళనాడులో బ్యాన్..!