అమరావతి : ఏపీలోని అల్లూరి ( Alluri District )జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళ్లి ఒడ్డుకు తిరిగి వస్తుండగా పడవ బోల్తా (Boat Over turn ) పడి ఒకరు చనిపోగా మరో ఇద్దరు గల్లంతయ్యారు ( Missing ) . జిల్లాలోని అనంతగరి మండలం జీనపాడు వద్ద రైవాడ జలాశయం వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతుడు జీనపాడుకు చెందిన జీవన్గా గుర్తించారు. గల్లంతైన మరో ఇద్దరి కోసం స్థానికులు, పోలీసుల సహాయంతో గాలిస్తున్నారు.
పార్వతీపురంలో..
పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కొమరాడ మండలం జంఝావతి రబ్బరు డ్యాంలో బంధువులతో కలసి ఈతకు వెళ్లారు. డ్యాంలో పడిన ఓ బాలుడిని కాపాడే ప్రయత్నంలో యువకులు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న మంత్రి అచ్చెన్న నాయుడు ప్రమాదంపై ఆరా తీశారు. గల్లంతైన యువకులు కోమరాడ మండలం సివిని వాసులుగా గుర్తించారు.