Vijayasai Reddy | అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. గతంలో తనపై అనే ఒత్తిళ్లు వచ్చాయని తెలిపారు. అయినా ఎలాంటి ఒత్తిడికి లొంగలేదనిపేర్కొన్నారు. శ్రీకాకుళంలో ఆదివారం నాడు రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో విజయసాయి రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి నేను రైతును మాత్రమే అని తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన మాత్రం లేదని స్పష్టం చేశారు. వేరే పార్టీలో చేరే ఉద్దేశం కూడా ఇప్పుడు లేదని తెలిపారు. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి తిరిగి వస్తానని స్పష్టం చేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరి ఆయన్ను డైవర్ట్ చేస్తోందని విజయసాయి రెడ్డి తెలిపారు. అందుకే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని పేర్కొన్నారు. నిబద్ధత లేని వ్యక్తుల మాటలను జగన్ నమ్మకూడదని సూచించారు. అలాంటి వారి మాటలు విని తప్పుదారి పట్టకూడదని హితవు పలికారు.
ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కూడా విజయసాయి రెడ్డి స్పందించారు. చంద్రబాబుకు, తనకు ఎటువంటి వైరం లేదని చెప్పారు. 20 ఏండ్ల క్రితం నుంచే పవన్ కల్యాణ్ తనకు మిత్రుడని తెలిపారు. తాను ఎప్పుడూ పవన్ కల్యాణ్‌ను విమర్శించలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా పవన్ కల్యాణ్‌ను విమర్శించనని చెప్పారు.
పవన్ కళ్యాణ్ తో నాకు 20 ఏళ్ల స్నేహ బంధం ఉంది:
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డినేను ఏ రోజూ పవన్ కళ్యాణ్ ను ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో కూడా అనను.. ఇది నా దృఢ సంకల్పం
నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను
అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి వస్తాను
అయితే.. ప్రస్తుతం ఏ పార్టీలో చేరే ఉద్దేశం… pic.twitter.com/3xMkMr55zQ
— BIG TV Breaking News (@bigtvtelugu) November 23, 2025