Keerthy Suresh | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ కీర్తిసురేశ్ (Keerthy Suresh). మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న ఈ భామ తమిళం, తెలుగుతోపాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. పక్కా ప్రొఫెషనల్‌గా ఉండే ఈ బ్యూటీ ఫిట్‌నెస్‌పై కూడా మంచి ఫోకస్ పెడుతుందని తెలిసిందే.
ఈ ముద్దుగుమ్మ ఓ విషయంలో ఇప్పటికీ ఫైట్ చేస్తుందట. ఇంతకీ ఏమిటా విషయమనుకుంటున్నారా..? కీర్తిసురేశ్ మంచి ఫుడ్ లవర్. ఈ విషయంలో ఇబ్బంది పడుతుందట. ఓ చిట్ చాట్‌లో ఇదే విషయమై కీర్తిసురేశ్ మాట్లాడుతూ.. ఫుడ్‌పై నాకున్న ఇష్టాన్ని నియంత్రించుకునే విషయంలో నేనిప్పటికీ నాతో నేనే ఫైట్ చేస్తుంటానని.. కఠినమైన డైట్‌ను ఫాలో అవడం తనకు చాలెంజ్‌తో కూడుకున్న పని అని చెప్పింది కీర్తిసురేశ్.
మొత్తానికి ఓ వైపు ఫుడ్ విషయంలో బ్యాలెన్స్ తప్పుతున్న ఫిజిక్ మెయింటైన్ చేయడంలో మాత్రం కీర్తిసురేశ్ కాంప్రమైజ్ అవడం లేదని ఈ బ్యూటీ లుక్స్ చూస్తే తెలిసిపోతుంది. ఫిట్నెస్ జర్నీ విషయంలో తన అభిమానులకు స్పూర్తిగా నిలిచే కీర్తిసురేశ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కీర్తిసురేశ్ ప్రస్తుతం తమిళంలో రివాల్వర్ రీటా సినిమాతోపాటు Kannivedi సినిమాలో నటిస్తుంది.
Meena | అందాల మీనా రెండో పెళ్లి ఎప్పుడు.. ఎట్టకేలకి క్లారిటీ వచ్చినట్టేనా?
Ajith Kumar | అరుదైన గౌరవం: అజిత్ కుమార్‌కు ‘జెంటిల్మన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ 2025’ పురస్కారం!